ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు లతామంగేష్కర్
బాలీవుడ్ గాయని లతామంగేష్కర్ అభిమానులకు శుభవార్త. ఆమెను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. లతామంగేష్కర్ గత కొన్నిరోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యతో లత మూడు వారాల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఆమెను ఉంచి, వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె త్వరగా కోలుకోవాలని యావత్ సినీరంగంతో పాటు ఆమె అభిమానులు ప్రార్థనలు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త మెరుగపడింది. దీంతో ఆమెను జనరల్ వార్డులకు షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. కాగా లతా మంగేష్కర్ సెప్టెంబరు 28న తన 90 పుట్టినరోజును జరుపుకున్నారు.